Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

ఒక్క సంతకం కోసం.. బరితెగించిన భార్య, కలికాలం!!

పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు రాజేస్తున్నాయి. కట్టుకున్నోళ్లని కాదని పరాయి వ్యక్తులతో పడక సుఖం కోసం పాకులాడుతూ దారుణాలకు తెగబడుతున్నారు. వివాహ బంధాన్ని అవహేళన చేస్తూ పక్కదారి పడుతున్నారు. ప్రియుడి కోసం బరితెగించిన భార్య కట్టుకున్న భర్తనే చేయించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగుచూసింది. భార్య తప్పు చేసినా ఆమెతోనే ఉంటానంటున్న భర్తని వదిలించుకునేందుకు పెద్ద స్కెచ్చే వేసింది. ప్రియుడితో కలసి అతన్ని కిడ్నాప్ చేసి మరీ సంతకాలు పెట్టించుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. సికింద్రాబాద్‌‌కి చెందిన వివాహిత మహిళకు మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడి మోజులో పడిపోయిన మహిళ.. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలనుకుని విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. విడాకులు తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంది. అయితే విడాకులు ఇచ్చేందుకు భర్త అంగీకరించకపోవడంతో ఆమె కన్నింగ్ ప్లాన్ వేసింది. ప్రియుడితోనే భర్తని కిడ్నాప్ చేయించింది. కట్టుకున్న భర్తని కిడ్నాప్ చేయించి బలవంతంగా విడాకుల పత్రాలపై సంతకం చేయించుకుని వదిలేసింది. అనంతరం భర్త లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బాధితుడి భార్య, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:

Post a Comment

0 Comments

Close Menu