Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

తగ్గిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!

బంగారం ధర వెలవెలబోయింది. పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం నేలచూపులు చూసింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. వరుసగా రెండో రోజు కూడా వెండి పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 దిగొచ్చింది. దీంతో బంగారం Gold ధర రూ.47,130కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 తగ్గుదలతో రూ.43,200కు క్షీణించింది. Also Read: బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి Silver ధర రూ.64,700కు చేరింది. వెండి పట్టీలు, కడియాలు, ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.20 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1733 డాలర్లకు తగ్గింది. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 22.46 డాలర్లకు చేరింది. Also Read: కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను GST (జీఎస్‌టీ), ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి.

Post a Comment

0 Comments

Close Menu