Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

టీటీడీపై తప్పుడు ప్రచారం.. ఓ ఛానల్‌ సహా పలువురికి షాక్, కేసులు నమోదు

తప్పుడు ప్రచారం చేసిన వారికి షాకిచ్చింది. శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేశారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. వీరిపై మంగళవారం రాత్రి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన రామ రాజ్యం మళ్లీ మొదలైంది, టీడీపీ పొలిటికల్ వింగ్ , గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ, మరో న్యూస్ ఛానల్, పేపర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా ఫేస్ బుక్‌లో పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సమర్పించారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మిజోరం సమీపంలో మయన్మార్ సరిహద్దులో అక్కడ జవాన్లు తల నీలాలు సీజ్ చేశారు. సోషల్ మీడియాలో టీటీడీపై కొంతమంది పోస్టులు పెట్టారు. దీంతో టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఆ 120 బ్యాగుల తలనీలాలు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో తెలిపింది. టీటీడీ తన వద్ద ఉన్న తలనీలాలను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తుంది. టెండర్‌లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తామని తెలిపింది. కొనుగోలు చేసిన బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా? దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదన్నారు. దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయని.. టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుందన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియని.. సంబంధిత అధికారులు తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్‌లో పెడతామంది.

Post a Comment

0 Comments

Close Menu