Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

జ‌మ్మూకాశ్మీర్‌లో ఎన్ కౌంట‌ర్.. 6 గురు ఉగ్ర‌వాదులు హ‌తం

     JAMMU&KASHMIR ENCOUNTER :  జమ్ముకాశ్మీర్ లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు 6 గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌ర్చాయి. ఈ మేర‌కు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వివ‌రాలు వెల్ల‌డించాయి. తీవ్ర‌వాద వ్య‌తిరేక చ‌ర్య‌ల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, కుల్గాం జిల్లాల్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు బుధ‌వారం సాయంత్రం కాల్పులు జ‌రిపాయి. ఇందులో నిషేధిత ఉగ్రవాద సంస్థ జేఈఎమ్‌కు చెందిన 6 గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. హతమైన ఉగ్రవాదుల్లో ఇద్ద‌రు పాకిస్తాన్‌కు చెందిన వారు కాగా.. మ‌రో ఇద్ద‌రిని స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు. మ‌రో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే అంశాన్ని ప‌రిశీలిస్తున్నారు. ఈ విష‌యాన్ని కాశ్మీర్ పోలీసులు కాశ్మీర్ జోన్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ కు ట్విట్ట‌ర్ లో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 
మొదటి ఎన్‌కౌంటర్ నౌగామ్ అనంత్‌నాగ్‌లో ప్రారంభమైంది, ఈ కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డాడు. ఆ తర్వాత జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్ ఉగ్రవాది సహా ముగ్గురు ఉగ్రవాదులు హత‌మ‌య్యారు. అనంత‌రం భద్రతా దళాలు కుల్గామ్‌లోని మిర్హామా వద్ద మరో ఆపరేషన్ ప్రారంభించాయి, అక్కడ జ‌రిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో మరో ఉగ్రవాది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 


Post a Comment

0 Comments

Close Menu