Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

చెక్ బుక్ వాడే వారికి అలర్ట్!

మీరు బ్యాంక్ చెక్ బుక్ ఉపయోగిస్తున్నారా? చెక్ బుక్ ద్వారానే ఎక్కువగా చెల్లింపులు నిర్వహిస్తుంటారా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మీరు మీ బ్యాంక్ అకౌంట్‌లో కచ్చితంగా చెక్‌కు సరిపడ డబ్బులు ఎప్పటికీ కలిగి ఉండాలి. లేదంటే ఇబ్బందిపడాల్సి రావొచ్చు. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఈ నెలలో కొత్త రూల్ తీసుకువచ్చింది. దీని ప్రకారం.. మీ చెక్ క్లియరెన్స్ శనివారం, ఆదివారం కూడా జరగొచ్చు. అందువల్ల బ్యాంక్ సెలవులతో పని లేకుండా కచ్చితంగా ఎప్పటికీ డబ్బులు కలిగి ఉండాలి. ఒకవేళ ఇలా డబ్బులు కలిగి ఉండకపోతే చెక్ బౌన్స్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో మీర మళ్లీ ఫైన్ కట్టాల్సి రావొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆర్‌బీఐ ఈ నెల ప్రారంభం నుంచే ఎన్ఏసీహెచ్ సేవలును ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని బ్యాంకులకు ఈ రూల్ వర్తిస్తుంది. Also Read: Also Read:

Post a Comment

0 Comments

Close Menu