Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

విజయవాడ: ఎమ్మార్వోకు షాకిచ్చిన రైతు.. అత్యాశకు పోతే ఉద్యోగానికి ఎసరు

కృష్ణా జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. మండలం రామన్నగూడెంలో మైలవరానికి చెందిన జన్నవరపు జగన్నాథంరెడ్డికి 31.49 ఎకరాల భూమి ఉంది. అక్కడ 340 టేకు చెట్లు ఉండగా.. వాటిని నరికేందుకు అనుమతి ఇవ్వాలని గతేడాది నవంబర్‌లో తహసీల్దారుకు దరఖాస్తు చేశారు. టేకు చెట్లు నరకాలంటే చెట్టుకు రూ.100 చొప్పున రూ.34వేలు ఇవ్వాలని సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌ డిమాండ్‌ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని చెబుతున్నా కొర్రీలు పెడుతూ ఇబ్బందిపెట్టారు. ఆఫీస్ చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో అడిగినంత ఇస్తానని బాధితుడు చెప్పాడు. వెంటనే ఏసీబీని ఆశ్రయించారు.. అధికారులు తహసీల్దారు కార్యాలయంపై నిఘా పెట్టారు. బాధితుడికి డబ్బు ఇచ్చి కార్యాలయంలోకి పంపించారు. ఆ డబ్బు తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ అనిల్‌ని పట్టుకున్నారు. అలాగే దీనిలో తహసిల్దారు భాగస్వామిగా ఉన్నారని అనిల్‌ చెప్పాడు.. అధికారులు కూడా గుర్తించారు. దీంతో తహసీల్టార్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. ఇద్ధరినీ అధికారులు రిమాండ్‌కు పంపారు. లంచం డిమాండ్ చేసిన అధికారుల్ని రైతు ఏసీబీకి పట్టించి షాకిచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu