Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

నెల్లూరు: నన్ను పట్టించుకోవడం లేదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జిల్లా కావలి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. కావలి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పర్యటించినా తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పర్యటనకు వచ్చి ఏదేదో రాసుకుని వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తానని తనను ఎమ్మెల్యేగా గెలిపించారని.. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మమకు తెలియకుండా, చెప్పకుండా కావలిలో అధికారులు వచ్చి తిరగడం ఎంత వరకు సబబని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకో తెలీదు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో తుఫాను వల్ల వచ్చిన వరదలకు పంటపొలాలన్నీ మునిగిపోయాయని.. వాటి గురించి చెప్పాలన్నా వినడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే గృహాలని పట్టించుకోవడం లేదని.. కావలి నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను అధికారులు పట్టించుకోవడం లేదని.. జిల్లా మంత్రులు వెంటనే దీనిపై స్పందించాలని కోరారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Post a Comment

0 Comments

Close Menu