Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

హైదరాబాద్: పండ్లు అమ్ముకుంటున్న వ్యక్తిపై నడిరోడ్డుపై దొరికిన బంగారం

మనకు రోడ్డుపై పది రూపాయలు దొరికితేనే మురిసిపోతాం. ఇవాళ మన టైం బావుందని టక్కున ఆ నోటును మన జేబులో వేసుకుంటాం. అలాంటిది బంగారం దొరికితే.. ఇక ఆరోజు మన పంట పండిందని పండగ చేసుకుంటాం. అలా ఓ పండ్లు అమ్ముకునే వ్యాపారికి నడిరోడ్డుపై దాదాపు ఒకటిన్నర తులం ఉండే బంగారు గొలుసు దొరికింది. దాని విలువ సుమారు రూ.75వేల రూపాయలు ఉంటుంది. తోపుడు బండిపై పండ్లు విక్రయించే వ్యక్తికి ఈ బంగారం దొరికింది. అయితే ఆయన దానిమీద ఆశపడలేదు. తనకు దొరికినా కూడా ఆ బంగారం తనది కాదని భావించాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. దీంతో అతని నిజాయితీకి పోలీసులు సలాం కొట్టారు. ఎరిగిడ్డ చెన్నయ్య పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం తుక్కుగూడ మార్కెట్‌ వద్ద పండ్లు అమ్మే ప్రాంతంలో తులంన్నర బంగారు గొలుసు అతనికి దొరికింది. అయితే ఆ గొలుసును తీసుకొని చెన్నయ్య ఎంచెక్కా ఇంటికి వెళ్లిపోవచ్చు. కానీ అతను అలా చేయలేదు. ఆ గొలుసును పహడీషరీప్‌ పోలీస్ స్టేషన్‌కు అప్పగించాడు. అంతకు ముందే మహేశ్వరం మండలం జండమర్రి తండాకు చెందిన కేతావత్‌ గామ అనే మహిళ తుక్కుగూడ మార్కెట్‌లో తన గొలుసు పడిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి కేతావత్‌ గామకు బంగారు గొలుసును అప్పగించారు. చెన్నయ్యను అభినందించారు.

Post a Comment

0 Comments

Close Menu