Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై నేడు క్లారిటీ

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వం గత నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన హోంమంత్రి మహమూద్‌ అలీ రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు. అన్ని అంశాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం ఆయన నిర్ణయం ప్రకటించనున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కొట్టిపారేశారు. లాక్‌డౌన్ విధించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

Post a Comment

0 Comments

Close Menu