Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

కర్నూలు: రోజూ స్కూల్‌కు వెళ్తున్న మహిళ.. ఆసక్తికర కారణం, శభాష్ అంటూ ప్రశంసలు

కర్నూలు జిల్లాలో ఓ మహిళ పట్టుదలకు అందరూ ఫిదా అవుతున్నారు. సంతకం నేర్చుకోవాలని రోజూ స్కూలుకు వెళ్తున్న ఆమెను ప్రశంసిస్తున్నారు. జంగాలపేట స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న మహిళ సుజాత చదువుకోలేదు.. ఆమె పొదుపు సంఘంలో చేరాలనుకుంది. కానీ సంఘంలో చేరాలంటే సంతకం చేయడం రావాలని చెప్పారు. దీంతో ఎలాగైన సంతకం నేర్చుకోవాలని భావించి.. స్కూల్‌‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తన పేరు రాయడం సంతకం చేయడం నేర్చుకొనేందుకు ఆమె రోజూ స్కూల్‌కు వెళుతున్నారు. తన పేరుతో సంతకం చేయాలన్న పలకా, బలపంతో పాఠశాలకు వచ్చి నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయురాలితో పలకపై పేరు రాయించుకుని దిద్దుతున్నారు. నాలుగు రోజులుగా రోజూ బడికి వస్తున్నానని సంతకం చేయడం నేర్చుకున్నానని సుజాత సంతోషంగా చెప్పారు. ఆమె పట్టుదలను అందరూ ప్రశంసిస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శం అంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu