Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్‌ వద్ద ఘోర రోడ్డుప్రమాదం... ఇద్దరి దుర్మరణం

ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఓఆర్ఆర్‌ సమీపంలోని జాతీయ రహదారిపై అతివేగంగా ప్రయాణించిన కారు ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. స్థానికులు, ఇతర వాహనదారుల సాయంతో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu