Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

నందిగామ మండలం చందాపురం వద్ద బిల్లు ఉండి కంపెనీలో ఒక అడ్రస్ పేరుతో బుకింగ్ చేసుకుని మరో చోట దిగుమతి అవుతున్న డెక్కన్ సిమెంట్ లారీ ని పట్టుకున్న కమర్షియల్ టాక్స్ అధికారులు AP UPDATES

కృష్ణాజిల్లా÷ నందిగామ మండలం చందాపురం వద్ద  బిల్లు ఉండి కంపెనీలో ఒక అడ్రస్ పేరుతో బుకింగ్ చేసుకుని మరో చోట దిగుమతి అవుతున్న డెక్కన్ సిమెంట్ లారీ ని పట్టుకున్న కమర్షియల్ టాక్స్ అధికారులు
 సిమెంట్ ఫ్యాక్టరీల నుండి లోడు ను తెప్పించుకొని సరైన అనుమతి పత్రాలు లేకుండా గృహ నిర్మాణం చేసుకునేవారికి రోజువారీ వ్యాపారం చేసుకునే వారికి తక్కువ ధర కు రహస్యంగా సరఫరా చేస్తున్న సిమెంట్ ముఠాగా సమాచారం

 ఇలా సరఫరా చేయటం ద్వారా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి షాపులు పెట్టుకున్నవారికి చేతిలో చిప్ప 

 గతంలో గౌరవరం గ్రామానికి చెందిన సత్యం అనే వ్యక్తి జగ్గయ్యపేట కు చెందిన మరో వ్యక్తి ఇద్దరూ కలిసి ముఠాలుగా ఏర్పడి సిమెంటు సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం అంతేకాకుండా వైజాగ్ స్టీల్ కంపెనీ  ముద్ర తో ఐరన్ కూడా తయారు చేసినట్లుగా సమాచారం

 ఏ షాపు వారైనా ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయటం మాకు మాజీ నక్సలైట్ లో సంబంధం ఉందని బెదిరించడం  సిమెంటు ఐరన్ ముఠా నైజం
 గత కొద్ది రోజుల క్రితం నందిగామలో ఒక ఐరన్ షాపు వ్యాపారిని నక్సల్స్ ఒక సంబంధం ఉంది అన్నట్లుగా బెదిరిస్తే అతను  పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం

 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిమెంటు ఐరన్ వ్యాపారం చేసేవారు  ఇలాంటి అక్రమ వ్యాపార మధ్యవర్తుల వల్ల తమ షాపులు నిర్వహించలేక మూత వేసుకునే పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నారు  ఇప్పటికైనా కమర్షియల్ అధికారులు స్పందించి ఇలాంటి వ్యాపారం చేసే ముఠా పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు

Post a Comment

0 Comments

Close Menu