అమరావతి
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబునాయుడి ప్రసంగం ముఖ్యాంశాలు వివరాలు..
ప్రభుత్వం పేదల దగ్గరున్న భూములను లాక్కొనేలా కొత్తగా అసైన్డ్ మెంట్ యాక్ట్ కి సవరణలు చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది.
★ ఆ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
★ అసైన్డ్ మెంట్ యాక్ట్ కింద ఎక్కువగా ఎస్సీలు, బీసీలే భూములు సాగుచేసుకుంటున్నారు.
★ వారి స్వాథీనంలో ఉన్న భూములను ఎవరైనా బలవంతంగా లాక్కున్నా, తిరిగి వారికే స్వాధీనపరిచి, సదరు భూములపై వారికే హక్కు కల్పించేలా గతంలోనే చట్టాలు చేశారు.
★ అటువంటి చట్టానికి తూట్లు పొడిచేపరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది.
★ మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.
★ ఎస్సీల భూములను, ఆదాయంకోసం ఎవరైనా వినియోగిస్తారని నీచంగా మాట్లాడుతున్నారు. అది చాలా దుర్మార్గం.
★ ఒకవేళ అలాజరిగితే చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు.
★ ప్రభుత్వం ఎస్సీలకు న్యాయం చేయాలనుకుంటే, చట్టం లేకపోయినా వారిభూములు వారికి ఇవ్వొచ్చుగా.
★ అదే సమయంలో ఎక్కువలాభం వస్తుందని చెబుతున్నారు.
★ లాభం కోసమే అయితే పేదలస్వాధీనంలోని భూములెందుకు ఇవ్వడం.. మీ సొంత భూములే ఇవ్వొచ్చుగా? మీరే మీ భూములిచ్చి, ఆలాభాలు మీరే పొందండి.
★ పేదలు, మరీ ముఖ్యంగా ఎస్సీల పొట్టకొట్టడమేంటి?
★ కోర్టులు మొన్ననే చాలా సీరియస్ గా చెప్పాయి. పేదల భూములు ఒకరి దగ్గర తీసుకొని మరొకరికి ఇస్తానంటారా... ఇదెక్కడి న్యాయం.. అసైన్డ్ మెంట్ భూములు లాక్కోవడం చాలా తప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది.
★ కోర్టులు చీవాట్లు పెట్టినా వీళ్లకు బుద్ధిరాలేదు.
★ ఈ రోజు వీళ్లు చేస్తున్న పనులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది.
★ బాధ్యతలేని, ప్రజాస్వామ్యంపై గౌరవం లేని స్పీకర్ కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అవతలి వైపున 10మందికి అవకాశమిచ్చి, వారితో నన్ను తిట్టిస్తారా?
★ మాపార్టీని విమర్శిస్తారు.. మాట్లాడదామంటే కనీసం మైక్ కూడా ఇవ్వరు.
★ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్థితికి దిగజారారు.
★ రాష్ట్రంపై పెనుభారం వేయబోతున్నారు. 10వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్పి చేస్తున్నామనిచెబుతున్నారు.
★ ఒకపక్క రాష్ట్రంలో ఇప్పటికే 19,500మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. కొత్తగా అగ్రిమెంట్లు జరిగాయి.
★ ఆ విద్యుత్తే సరిపోతుంది. వీళ్లు కావాలనే అవినీతికోసం అదనంగా ఉత్పత్తి అంటూ వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నాలు మొదలెట్టారు.
★ ప్రజలపై పెనుభారం వేసేపరిస్థితికి వచ్చారు.
★ పీపీఏలపై విమర్శలు చేసిన పెద్దమనుషులు, విపరీతంగా ఎక్కడాలేని విధంగా ఇన్సెంటివ్ లు ఇచ్చారు.
★ ఆ ఇన్సెంటివ్ లు ఇచ్చినవిధానం కూడా చాలా దారుణం.
★ వీటన్నింటిపై మేము చర్చ జరగాలంటున్నాం. మీకు మీరు కావాలని బలవంతంగా అవినీతికోసం మరో 10వేల మెగావాట్లు తేవచ్చు.
★ కానీ ప్రజలు మిమ్మల్ని ఛీకొట్టే పరిస్థితి వస్తుంది.
★ రాబోయే రోజుల్లో మీకు తగినగుణపాఠం చెప్పే వస్తుందని, ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా..
0 Comments