Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

బిసిల పక్షపాతి జగన్ AP UPDATES

బిసిల పక్షపాతి జగన్

ప్రభుత్వ పధకాలను అందరికి చేరువ చేయాలి

దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్రకు శ్రీఘాకోళ్ళపు సత్కారం

బొమ్మన రాజ్ కుమార్ కి ఘన నివాళి

రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిసిల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 56 బిసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బిసిల పక్షపాతి అని నిరూపించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సిటి కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈరోజు రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర బాబు విచ్చేశారు. ముందుగా జాంపేట బ్యాంకు చైర్మన్ దివంగత బొమ్మన రాజ్ కుమార్ చిత్రపటాలకు శివరామ సుబ్రహ్మణ్యం, సురేంద్రబాబు,తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.అనంతరం శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వెనుకబడిన తరగతి‌ వారిని ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. మంత్రి పదవుల్లో కూడా కీలకమైన శాఖలను బిసిలకు కట్టబెట్టి బిసిలకు అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహనరెడ్డి అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాంగుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రసాదుల హరనాధ్,నండూరి రమణ,ఇసుకపల్లి శ్రీనివాస్, బత్తుల రాజేశ్వరరావు, దొంతంశెట్టి వీరభద్రరావు, పెంకే సురేష్,కొండపల్లి పట్టియ్య,చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి,కాటం రజనీకాంత్, కోడికోట సత్తిబాబు,మేరపురెడ్డి రామకృష్ణ, ముప్పన శ్రీనివాస్,కుక్కా తాతబ్బాయి,దూర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu