చిలకలూరిపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎన్అర్టి సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద గురువారం ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని, మద్దతు ధర కల్పిస్తామని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు దాసోహం అంటుందన్నారు.ప్రధాని మోడీ ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను మానుకో వాలన్నారు. రైతు ఉద్యమం మోడీకి తగిన గుణపాఠం కావాలన్నారు. కొత్తగా వచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుల జీవితాల్లో అంధ కారం నింపుతాయన్నారు. .వైసిపి, టిడిపి లకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాల తరహాలో రాష్ట్ర శాసనసభలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, సిపిఐ ఏరియా కార్యదర్శి సీఆర్ మోహన్, కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం రాధాకృష్ణ, జనక్రాంతి పార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్, నవతరం పార్టీ అధ్యక్షుడు రావూ సుబ్రమణ్యం, సీపీఎం నాయకులు పోపూరి సుబ్బారావు, సాతులూరి బాబు, టి రమేష్, ఎస్ వెంకటసుబ్బయ్య, సిపిఐ నాయకులు సుభాని, పేలూరి రామారావు, టి బాబురావు, దాసరి వరహాలు, కాంగ్రెస్పార్టీ నాయకులు కె సురేష్ తదతరులు పాల్గొన్నారు.
0 Comments