Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

పోలీస్ ఇంటరాగేషన్ రూమ్ లలోసిసి కెమెరాలు, ఆడియో రికార్డింగ్ ఎక్విప్ మెంట్ ఉండాలి... సుప్రీంకోర్టు చరిత్రాత్మక ఆర్డర్.. ap updates

పోలీస్ ఇంటరాగేషన్ రూమ్ లలో
సిసి కెమెరాలు, ఆడియో రికార్డింగ్ ఎక్విప్ మెంట్ ఉండాలి... సుప్రీంకోర్టు చరిత్రాత్మక ఆర్డర్..
---------------------------///


దేశంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్‌ పరికరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటరాగేషన్‌ చేపట్టే గదులు, లాకప్‌లు, కార్యాలయాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, ప్రధాన ద్వారం, కారిడార్లు, లాబీల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచించింది. మానవ హక్కుల ఉల్లంఘనలను తనిఖీ చేసేందుకు వీలుగా పోలీస్‌స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఉంచాలని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ, ఎన్సీబీ, డీఆర్‌ఐ సహా పలు దర్యాప్తు సంస్థలు తమ కార్యాలయాల్లోనే నిందితులను విచారిస్తుంటాయని, అందువల్ల సీసీటీవీలు, రికార్డింగ్ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. రాత్రిపూట స్పష్టంగా ఆడియో, వీడియో రికార్డు చేయగలిగే సామర్థ్యంతో కూడిన కెమెరాలను అమర్చాలని సూచించింది. సాధ్యమైనంత ఎక్కువ కాలం డేటాను నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉన్న పరికరాలను కొనుగోలు చేయాలంది. 2018లో పంజాబ్‌లో జరిగిన కస్టోడియల్‌ హింస కేసు విచారణ నేపథ్యంలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఇప్పటికీ అమలు జరగడంలేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. తాజా ఆదేశాలకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆరు వారాల్లోగా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది.

Post a Comment

0 Comments

Close Menu