Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

నివర్ తుఫాన్ దాటికి అన్నదాత కుదేలు-పరిహారం ఇవ్వకుంటే ఉద్యమమే:బండారుపల్లి సత్యనారాయణ ap updates

నివర్ తుఫాన్ దాటికి అన్నదాత కుదేలు-పరిహారం ఇవ్వకుంటే ఉద్యమమే:బండారుపల్లి సత్యనారాయణ


ఈరోజు నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీమంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి పిలుపు మేరకు, తుఫాను వల్ల నాదెండ్ల మండలంలో పలు గ్రామాలలో పంటలు త్రీవంగా దెబ్బతిన్నాయి. వరి, మిరప, పత్తి పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని  ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, నాదెండ్ల తహసిల్దార్ గారిని, అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, తుఫానులతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నాయని, మిరప తోట చేతికి వచ్చే సమయనికి బొబ్బర ముడతలు వచ్చి కోలుకోలేని విధముగా చేసిందని, వరి పంట దిగుబడి వచ్చే సమయంలో నీట మునిగాయని తెలిపారు. అధికార యంత్రాంగం ముందే రైతులకు హెచ్చరికలు చేసివుంటే తగిన జాగ్రత్తలు తీసుకునేవారని, ఇప్పుడు ఐదు వేల రూపాయలు కూడ చేతికి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైనదని, అవగాహన లేకపోవడం వల్లన నేడు రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 
నష్టపోయిన రైతులకు వాణిజ్య పంటకు ఎకరానికి యాభై వేల రూపాయలు, వరి పంటకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఇన్ పుట్ సప్సిడి ద్వారా రుణాలను మంజూరు చేయడం జరిగిందని, వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం, ఇలా అనేక విధాలుగా రైతులకు అండగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయంలో అవినీతి, అక్రమాలు తప్ప చేసిందేమీ లేదని హితవు పలికారు. అసలు ఈ ప్రభుత్వం రైతుల పార్టీ కాదని అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలవాలని కోరారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బండారుపల్లి సత్యనారాయణ, నెల్లూరి హరిబాబు, గుర్రం స్వాములు, తోటరాముడు, షేక్ ఖాజా, షేక్ మస్తాన్ వలి, కాసిమల్ల రాజు తదితరలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu